Ad Code

ఈషా ఫౌండేషన్ పై పోలీసుల చర్యలకు మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే !


ద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ పై పోలీసుల చర్యలకు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేషన్ తో లింకున్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు పోలీసులు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న తన ఇద్దరు కూతుళ్లకు బ్రెయిన్వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో వాదనలు విన్నది. ఆ ఇద్దరు మహిళలతో ధర్మాసనం మాట్లాడింది. తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్లు ఆ ఇద్దరు మహిళలు వెల్లడించారు. తమను ఎవరూ నిర్బంధించడంలేదని పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్పై నమోదు అయిన కేసును మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తమిళనాడు పోలీసులు ఇచ్చే స్టేటస్ రిపోర్టును సుప్రీంకు సమర్పించాలని ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu