టెలికాం పరికరాల ఎగుమతులు దిశగా హెచ్ఎఫ్సీఎల్ !


దేశీయ టెలికాం గేర్‌ తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ ఫైబర్‌ వచ్చే మూడేళ్లలో ఆప్టిక్‌ సెగ్మెంట్‌లో 70%, నెట్‌వర్క్‌ పరికరాల వ్యాపారంలో 50% ఆదాయాన్ని ఎగుమతుల ద్వారా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5G మొబైల్‌ టవర్లను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత కంపెనీకి ఇప్పుడు 5జీ గేర్‌లకు డిమాండ్‌ పెరుగుతోందని హెచ్ఎఫ్సీఎల్ ఎండీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే 40 దేశాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లను ఎగుమతి చేస్తోందని, తాజాగా టెలికాం పరికరాల ఎగుమతులను కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. హెచ్ఎఫ్సీఎల్ దేశీయంగా అనేక 5జీ పరికరాలను రూపొందించిందని, ఇప్పుడు వాటిని విదేశాల్లో కూడా విక్రయించడం ప్రారంభించిందని హెచ్ఎఫ్సీఎల్ ఎండీ నహతా చెప్పారు. 6జీ టెక్నాలజీకి సంబంధించి కంపెనీ ఇప్పటికే దాదాపు 15 పేటెంట్లను ఫైల్‌ చేసింది.

Post a Comment

0 Comments