Ad Code

ఉగ్రవాద కార్యకలాపాలు వాణిజ్యాన్ని అభివృద్ధి చేయలేవు !


పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న 23వ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ)లో బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు వాణిజ్యాన్ని అభివృద్ధిపరచలేవని అన్నారు. అభివృద్ధి, వృద్ధికి నిజాయితీతో కూడిన భాగస్వామ్యాలు, శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు వాణిజ్యం, ఇంధన సామర్థ్యం మరియు సంబంధాలను అడ్డుకుంటాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిథ్యం కల్పించేందుకు ఐరాస భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు అవసరమని పునరుద్ఘాటించారు. ఎస్‌సిఒ ఈ సంస్కరణల కోసం వాదించాలని, మరింత మంది ప్రతినిధులను కలుపుకుని ప్రజాస్వామ్య భద్రతా మండలిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత భారత విదేశాంగ మంత్రి మొదటిసారి పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

Post a Comment

0 Comments

Close Menu