హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజీపీ హ్యాట్రిక్ సాధించింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన బీజేపీ, హర్యానా సీఎం ఎవరనేదానిపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, ఈసారి కూడా నాయబ్ సింగ్ సైనీనే హర్యానా సీఎంగా కొనసాగుతారని సమాచారం. ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన లెక్కింపుల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 49 స్థానాల్లో కాషాయ పార్టీ విజయం సాధించగా, 36 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. రాష్ట్రంలో విజయం సాధించినందుకు ప్రధాని మోడీ నాయబ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు సైనీ అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. పార్టీలో పలు పదవులు చేపట్టాడు. 2014లో నారాయణ్‌గఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అనంతరం సీఎంగా పగ్గాలు స్వీకరించాడు.
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ?
الثلاثاء، 8 أكتوبر 2024
national ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజీపీ హ్యాట్రిక్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన బీజేపీ హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ?
ليست هناك تعليقات:
إرسال تعليق