తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సీఐడీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసుల దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ మంగళగిరి, తాడేపల్లి పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ కేసుల విచారణకు సంబంధించిన ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ సోమవారం నాడు అందజేయనున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 2021 అక్టోబర్ 19న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిల అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంపై సైతం దాడి జరిగింది. మాజీ మంత్రి జోగి రమేశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితరులు, వారి అనుచరులతో వెళ్లి చంద్రబాబు ఇంటిపై దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ ఎంసీ నందిగం సురేశ్ సహా మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రెండు కేసులు వేగంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సీఐడీకి అప్పటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ జరిగిన విచారణ ఫైళ్లను సోమవారం నాడు సీఐడీకి పోలీసులు అప్పగించనున్నారు.
టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత !
الأحد، 13 أكتوبر 2024
Andhra Pradesh ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత టీడీపీ ఆఫీసు ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ సోమవారం నాడు అందజేయనున్నారు
ليست هناك تعليقات:
إرسال تعليق