ముంబైకి చెందిన ఒక జంట రెండేళ్ల క్రితం తమ ఇంట్లో పనిమనిషిని నియమించుకున్నారు. ఇంటి పనులతో పాటు పిల్లలను కూడా చూసుకుంది. అయితే అక్టోబర్ మొదటి వారంలో వ్యక్తిగత కారణాలతో పని మనిషి ఉద్యోగం మానేసింది. ఎందుకు పని మానేసిందో వాళ్లకి అర్థం కాలేదు. అయితే దుర్గాపూజ సందర్భంగా ఆ గృహిణి తన కొత్త చీర కోసం వెతకగా అది కనిపించలేదు. పనిమనిషిని పిలిచి అడగ్గా ఇస్త్రీ చేసిన తర్వాత ఆమె చీరను అల్మారాలో ఉంచిందని చెప్పింది. అయితే సీసీటీవీని పరిశీలించగా మహిళ బ్యాగ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో వారికి అనుమానం వచ్చింది. అయినప్పటికీ వదిలేశారు. కొద్దిరోజుల తర్వాత పనిమనిషి అదే చీరను కట్టుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టింది. అంతేకాకుండా తన గడియారాన్ని కూడా ధరించడం కనిపించింది. అనంతరం దంపతులిద్దరూ ఇంట్లోని సామాగ్రిని పరిశీలించగా నగదుతోపాటు నగలు, వాచీలు, చీరలు, కళ్లద్దాలు, బట్టలు, మేకప్ కిట్ కూడా మాయమైనట్లు గుర్తించారు. ఇంటి నుంచి సుమారు రూ.2.5 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. పనిమనిషిపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దొంగ పనిమనిషిని పట్టించిన వాట్సాప్ స్టేటస్ !
الأحد، 20 أكتوبر 2024
mumbai national science technology WhatsApp కళ్లద్దాలు చీరలు దొంగ పనిమనిషిని పట్టించిన వాట్సాప్ స్టేటస్ నగదుతోపాటు నగలు బట్టలు మేకప్ కిట్ కూడా మాయం వాచీలు
ليست هناك تعليقات:
إرسال تعليق