వైసిపికి వాసిరెడ్డి పద్మ రాజీనామా !


వైసిపి హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపించారు. ఈమె పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు. ఈమెకు జగన్ పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ పదవి క్యాబినెట్ హోదా తో సమానమైనది. గత ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు వాసిరెడ్డి పద్మ. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా రాజీనామా చేశారు. జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో జగ్గయ్యపేట అసెంబ్లీ సీటును ఆశించారు. తనకు కానీ.. తన భర్తకు కానీ టికెట్ ఇవ్వాలని అధినేత జగన్ ను కోరారు. కానీ జగన్ పట్టించుకోలేదు. సీటు దక్కకపోయేసరికి మౌనం దాల్చారు పద్మ. అయితే ఎన్నికలకు ముందే ఆమె పార్టీని వీడుతారని ప్రచారం సాగింది. కానీ సైలెంట్ గా ఉండి పోయారే తప్ప పార్టీకి గుడ్ బై చెప్పలేదు. ఇప్పుడు కాజా గారి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వరుసుగా నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. ఈమె సైతం వారినే అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments