ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని 20వ వార్డులో విద్యుత్ షాక్‌తో గంటల వ్యవధిలోనే తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక వీర రాఘవపురం సత్తమ్మతల్లి గుడి సమీపంలో నివసిస్తున్న చిట్టిమని పద్మ (40) శనివారం ఇంటి పక్కన ఉన్న కాల్వలోకి తుళ్లిపడి మృతి చెందారు. ఆదివారం ఆమె కుమారుడు విశ్వేస్ (23) కూడా అక్కడే దుస్తులు ఆరేసే తీగను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. దీంతో పద్మకూడా విద్యుత్ షాక్ గురై మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విద్యుత్ షాక్కు బలైన తల్లీకొడుకు !
الأحد، 20 أكتوبر 2024
Andhra Pradesh Criem ఇంటి పక్కన ఉన్న కాల్వలోకి తుళ్లిపడి మృతి దుస్తులు ఆరేసే తీగను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి మృతి విద్యుత్ షాక్కు బలైన తల్లీకొడుకు
ليست هناك تعليقات:
إرسال تعليق