తెలంగాణలోని నిజామాబాద్‌లో ప్రొపెసర్ కోదండరాం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ - 1 ఎగ్జామ్స్ మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు. జీవో 55, 29 ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు. తమ పార్టీ అప్పుడు, ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందని తెలిపారు. తమ ఆందోళనలు, సూచనలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.
గ్రూప్ - 1 ఎగ్జామ్స్ మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదు !
الأحد، 20 أكتوبر 2024
telangana కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవు గ్రూప్ - 1 ఎగ్జామ్స్ మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదు ప్రొపెసర్ కోదండరాం
ليست هناك تعليقات:
إرسال تعليق