టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు !


సరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దసరా రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ప్రకటించారు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులను అదనంగా నడిపిస్తున్నామన్నారు. అయితే స్సెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని సజ్జనార్ స్పష్టం చేశారు. రిటర్న్ జర్నీలో ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుందని, అందుకే కొంత ఛార్జీలు పెంచడం జరిగిందని సజ్జనార్ వివరించారు. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయని, గురువారం నుంచి మొత్తం బస్సులను నడిపిస్తామని సజ్జనార్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అయితే, మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ చేసే మహిళలు తప్పకుండా తమ ఆధార్ కార్డు చూపించాలని స్పష్టం చేశారు. కార్డు చూపించకుండా ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగొద్దని ఈ సందర్బంగా ఆయన కోరారు.

Post a Comment

0 Comments