కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ శరీరానికి కావాల్సిన ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తాయి. డీహైడ్రేషన్ సమస్య బారినపడకుండా శరీరం ఉత్సాహంగా ఉంచడంలో కొబ్బరి బొండం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలు మరింత పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు. అయితే కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారికి కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయని కూడా నిపుణులు చెబుతుంటారు. లోబీపీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది లోబీపీకి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లోబీపీతో బాధపడేవారు కొబ్బరి నీటిని తక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరి నీళ్లను పరిమితంగా తీసుకుంటే బాడీకి చాలా మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరిగి పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లను అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొబ్బరి నీళ్లలో మోనోశాకరైడ్లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్లు, పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే... అవి బాడీ నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి. దీంతో విరేచనాలయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇది చక్కెర అధిక కేలరీలను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొబ్బరి నీళ్లను అధికంగా తీసుకునే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత చాలా మంది కడుపు తిమ్మిరి లేదా అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
0 Comments