ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో రైలు పట్టాలపై గంజాయి సేవించిన ఇద్దరు విద్యార్థులు మత్తులో ఉండగా రైలు ఢీకొని మృతి చెందారు. కదిరి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీలేరుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్ కుమార్ (18), ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్లి గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నాగర్ కోయిల్ నుంచి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తోన్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లోకోపైలట్ అందించిన సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి చూడగా యాసిన్ అప్పటికే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న కిరణ్ కుమార్ ను తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని, వారి వద్ద గంజాయి పొట్లాలు దొరికాయని రైల్వే పోలీసులు వెల్లడించారు.
రైలు ఢీకొని గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి !
الخميس، 24 أكتوبر 2024
Andhra Pradesh Criem నాగర్ కోయిల్ నుంచి ముంబయి వెళ్లే రైలు పీలేరుకు చెందిన కిరణ్ కుమార్ యాసిన్ రైలు ఢీకొని గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق