లావా అక్టోబర్ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మోడల్ లభించనుంది. లావా అగ్ని-3 బార్ ఫోన్లో రేర్ డిస్‌ప్లేతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్‌ప్లే పొందుపరిచారు. ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 2.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్ కెమెరా, సామ్‌సంగ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో రూపుదిద్దుకుంది. లావా అగ్ని-3 స్మార్ట్‌ఫోన్ 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని-3 రాకతో రూ.20-25 వేల ధరల శ్రేణిలో ఆన్‌లైన్ విభాగంలో 2025-26 నాటికి 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ఈడీ సునీల్ రైనా తెలిపారు.
అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు ప్రారంభం !
السبت، 5 أكتوبر 2024
1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్‌ప్లే science technology అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు ప్రారంభం అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్ మోడల్
ليست هناك تعليقات:
إرسال تعليق