ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై ఇన్ని రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను నాగవంశీ కొనుగోలు చేసారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇటు తెలుగులోను మరే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లేకపోవడంతో దసరా సీజన్ ను దేవర ఫుల్ గా క్యాష్ చేసుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. మొదట్లో తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. 'దేవర' రెండో భాగం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
0 Comments