అక్టోబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2024 ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సేల్ అక్టోబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్లతో పాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. నోకాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ లో సేల్ డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్లపై డిస్కౌంట్లను పొందవచ్చు. దీంతోపాటు ఫ్యాషన్ ఉత్పత్తులను కూడా తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పేజీ ఆధారంగా ప్రముఖ స్మార్ట్బ్రాండ్ ఉత్పత్తులు ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, వివో సహా స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చు. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ M2, ఐప్యాడ్లు, ఎయిర్‌పాడ్స్ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు సౌండ్బార్లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్, సోనీ, షియోమీ వంటి బ్రాండ్ల స్మార్ట్‌టీవీలను కూడా భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు.
0 Comments