తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ తమ్మకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ తమ్మకాయలలో పాలు పోసి ఇగురు లేదా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలలాగే ఈ తమ్మకాయలను కూడా తినవచ్చు. ఈ తమ్మకాయల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చాలామందికి కళ్ళ కింద గానీ ముఖం మీద నలుపు ఎక్కువగా రావడం, మెడ మీద నలుపు, మంగు మచ్చలు రావడం ఇవన్నీ డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మెలనోసైట్స్ కణజాలం నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఈ తమ్మకాయలలో ట్రిప్సీన్ హీబీటర్ ఉండి ఈ మెలనోసైట్స్ లో ఉన్న మెలనిన్‌ని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. అలాగే తమ్మకాయల్లో ఉండే ఎల్డోప మరియు పాలి ఫినాల్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. పార్కిన్సన్ డిసీస్ వచ్చి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది. షివరింగ్ తగ్గించడానికి, వేళ్ళల్లో కాళ్ళల్లో పట్టు పెంచడానికి, తూలిపోకుండా బ్యాలెన్సింగ్ నేచర్ ఇవ్వడానికి అట్లాగే నరాల గ్రిప్ ని పెంచడానికి ఈ ఎల్డోప బాగా ఉపయోగపడుతుంది. తమ్మకాయల కూర తీసుకోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
0 Comments