తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైకాపా నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు గురువారం సాయంత్రం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. దీంతో సురేశ్‌కు రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.
వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ ?
الخميس، 5 سبتمبر 2024
Andhra Pradesh తెదేపా కార్యాలయంపై దాడి కేసు నిందితులంతా అజ్ఞాతంలోకి వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ ? హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో
ليست هناك تعليقات:
إرسال تعليق