హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించిన కేటీఆర్.. ఓ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాను బయటపడేయడంతో వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకుని నిరుపేదల తలదాచుకున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలాంటి హృదయ విదారక ఘటనలను చూసే పరిస్థితి రాదని అన్నారు. మానవ పునరావాస విధానాలతో బయటకు రావాలని ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
ホーム
/
హైడ్రా పేరుతో
/
పేరుకేమో ప్రజా ప్రభుత్వం - కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు
الأحد، 8 سبتمبر 2024
telangana ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించిన కేటీఆర్. పేరుకేమో ప్రజా ప్రభుత్వం - కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు వీడియోను షేర్ హైడ్రా పేరుతో
ليست هناك تعليقات:
إرسال تعليق