విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఇప్పటికే ఉక్కు ఉత్పత్తికి సంబంధించి ముడి సరుకులు, బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు 100 మందికి వేరే స్టీల్ ప్లాంట్లో సర్దుబాటు చేశారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలు మరింత అనుమానాస్పదంగా మారాయి. ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళిపోయారు. నవంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకు ఆయన సెలవు పెట్టడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. ఏకకాలంలో ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోవడం, మేనేజింగ్ డైరెక్టర్ సెలవులోకి వెళ్లిపోవడం, శాశ్వత ఉద్యోగుల సర్దుబాటు జరగడంతో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని స్పష్టమైంది.

Post a Comment

Previous Post Next Post