తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొంది. అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు, ఫిల్మ్ ఛాంబర్‌తోపాటు పలువురు నిర్మాతలు వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు. బాధితుల సహాయార్థం రెండు రాష్ట్రాలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెరో రూ.25 లక్షలు, తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపాయి. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు నిర్మాత సురేశ్ బాబు రూ. కోటి, దిల్ రాజు ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ''ఇలాంటి విపత్తుల సమయంలో సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది'' అని అన్నారు. ''ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ చేయూత అందిస్తుంటుంది. అండగా ఉంటుంది. ధనమే కాకుండా నిత్యావసరాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..''మేం ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం'' అని చెప్పారు. ''తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. ఛాంబర్ తరఫున సాయం చేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ నంబరుకు విరాళాలు అందించాలని కోరుతున్నాం. వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం'' అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..''రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఒక రోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం''అని వివరించారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..''వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని పరిష్కరించేలా ముందుకు వెళ్తుంది'' అని పేర్కొన్నారు. సమావేశంలో భరత్ భూషణ్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు !
الخميس، 5 سبتمبر 2024
Andhra Pradesh cinema telangana కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ليست هناك تعليقات:
إرسال تعليق