తెలంగాణలోని ములుగు జిల్లాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మేడారం అటవీ ప్రాంతంలో 50 వేలకు పైగా చెట్లు టోర్నడోల దెబ్బకు నేలకూలాయని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆగస్టు 31 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. 15 కి.మీ. పరిధిలోని 150 హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్రమైన సుడిగాలులు చెలరేగడంతో చెట్లు విరిగిపడ్డాయని అటవీశాఖాధికారులు చెప్పారు. నల్లమద్ది, తెల్లమద్ది,జువ్వి, నేరేడు, మారేడు వంటి చెట్లు నేలకూలినట్టుగా అధికారులు గుర్తించారు. టోర్నడోలు అంటే తీవ్రస్థాయిలో వచ్చే సుడిగాలులు. వీటిని సుడి గాలి తుపాన్ అని కూడా అంటారు. దట్టమైన మేఘాల నుంచి ఇవి దూసుకొస్తుంటాయి. ఆకాశంలో రెండు భిన్నమైన ద్రవ్యరాశులు డీకొంటే టోర్నడోలు ఏర్పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి పైకి వెళ్తుంది. అయితే పైన ఉన్న చల్లటి, పొడి గాలిని తాకినప్పుడు థండర్ క్లౌడ్స్ ఏర్పడుతాయి. ఇవి గాలిలో పైకి కదులుతాయి. దీన్ని అప్ డ్రాప్ట్ అంటారు. విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పులతో ఈ అప్ డ్రాప్ట్ సుడి తిరగడం మొదలుపెడుతుంది. దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఉన్న ఈ వైరుద్యం గణనీయ స్థాయిలో ఉంటే టోర్నడోను కలిగించే సూపర్ సెల్ థండర్ క్లౌడ్స్ ఏర్పడుతాయి. టోర్నడోలు గంటకు 180 కి.మీ లోపు గాలులతో 250 అడుగుల వైశాల్యంతో ఇవి ఉంటాయి. ఇవి గంటకు 480 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఏకధాటిగా టోర్నడో 100 కి.మీ దూరం వెళ్తాయి. ఇది ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి. మేడారం అటవీ ప్రాంతంలో గంట వ్యవధిలో వచ్చిన తీవ్రమైన సుడిగాలులకు కారణాలు ఏమై ఉంటాయని అధికారులు పరిశీలిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ గాలులు వచ్చాయ, లేక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
ములుగు అడవుల్లో తీవ్రమైన సుడిగాలులకు నేలకొరిగిన 50 వేలకు పైగా చెట్లు !
الخميس، 5 سبتمبر 2024
telangana జువ్వి తెల్లమద్ది నల్లమద్ది నేరేడు మంత్రి సీతక్క ప్రకటన మారేడు ములుగు అడవుల్లో తీవ్రమైన సుడిగాలులకు నేలకొరిగిన 50 వేలకు పైగా చెట్లు
ليست هناك تعليقات:
إرسال تعليق