ఓ మహిళ బావి గోడ అంచున కూర్చుని చిన్నపిల్లాడితో ప్రమాదకరంగా రీల్స్ చేసింది. బావి గోడ అంచున కూర్చొన్న ఆమె సుమారు రెండు మూడేళ్ల పిల్లాడిని బావి లోపలి వైపునకు ఉంచి అతని చేతిని పట్టుకుంది. అటు ఇటు అతడ్ని తిప్పుతూ ప్రమాదకరంగా రీల్స్ చేసింది. ఏదైనా పొరపాటు జరిగితే ఆ చిన్నారి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడిందంటూ మండిపడుతున్నారు. ఆ బాలుడు ఎంత భయాందోళనకు గురై ఉంటాడో అని అంటున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన పిల్లాడితోపాటు ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగి ఉండేదని.. లైక్స్ కోసం ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆమె వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసిన ఆయన, పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు అవసరమా? అని మండిపడ్డారు. ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అని వీసీ సజ్జనార్ హితవు పలికారు.
బావి అంచున కూర్చుని చిన్నారితో రిస్కీ రీల్ చేసిన మహిళ !
الأحد، 22 سبتمبر 2024
ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అని వీసీ సజ్జనార్ హితవు ఏదైనా పొరపాటు జరిగితే ఆ చిన్నారి ప్రాణాలకే ప్రమాదం తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ share బావి అంచున కూర్చుని చిన్నారితో రిస్కీ రీల్ చేసిన మహిళ
ليست هناك تعليقات:
إرسال تعليق