నేవీ, న్యూక్లియర్ విస్తరణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. డ్రాగన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అణుజలాంతర్గామి మునిగిపోయిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మ్యాక్సర్ టెక్నాలజీస్ మార్చి 10న తీసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం వుహాన్ సమీపంలోని షిప్‌యార్డ్ వద్ద ఈ జలాంతర్గామిని చైనా నిలిపి ఉంచింది. జూన్ చిత్రాల్లో మాత్రం ఆ సబ్‌మెరైన్ మళ్లీ తీరం వద్దకు తిరిగిరాలేదు. ''ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఝౌ క్లాస్‌లోని తొలి జలాంతర్గామి తీరం సమీపంలో మునిగిపోయిందనే విషయాన్ని దాచిపెట్టేందుకు పీఎల్‌ఏ ప్రయత్నిస్తోంది'' అని యూఎస్ రక్షణ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. చైనా షిప్‌యార్డులకు సంబంధించిన శాటిలైట్ దృశ్యాలను పరిశీలించే టామ్ షుగార్ట్ ఈ విషయాన్ని గుర్తించారు. సెంటర్ ఆఫ్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ''నేను ఒకేదగ్గర భారీ సంఖ్యలో క్రేన్లను చూడలేదు. శాటిలైట్ దృశ్యాలను చూస్తే.. ఒక క్రేన్ మాత్రమే కనిపించింది. సాధారణంగా జలాంతర్గాముల్ని లాంఛ్ చేసిన తర్వాత అవి కొన్ని నెలల పాటు షిప్‌యార్డ్ వద్ద ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు'' అని టామ్ వెల్లడించారు. యూఎస్‌కు దీటుగా తన ఆర్మీని ఆధునికీకరిస్తోన్న చైనా.. నావికా, సబ్‌మెరైన్ విస్తరణకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తోంది. గత ఏడాది కూడా చైనా సబ్‌మెరైన్‌కు సంబంధించిన ప్రమాదం జరిగింది. అణుశక్తి సబ్‌మెరైన్ '093-417' ఎల్లో సముద్ర జలాల్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గత ఏడాది ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా నోరు మెదపలేదు. బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. కానీ, తర్వాత బ్రిటన్ సబ్‌మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సబ్‌మెరైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్‌డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఇక్కడికి అమెరికా, బ్రిటన్‌ల జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో డ్రాగన్ ఏర్పాటుచేసిన 'చైన్, యాంకర్ ఉచ్చు'లో దాని సబ్‌మెరైన్ చిక్కినట్లు 'డైలీ మెయిల్' కథనంలో పేర్కొంది. బీజింగ్ నౌకాదళం ఇలాంటి ఉచ్చులను వినియోగిస్తూ ఉంటుంది. ఈ ప్రమాదంపై అప్పుడు బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ స్పందించలేదు. కానీ ఈ ఘటన జరిగిందని నమ్మేందుకు బలమైన కారణాలున్నాయని ఓ బ్రిటన్ సబ్‌మెరైనర్ వివరించారు. చైనా సబ్‌మెరైన్లలో విపత్కర పరిస్థితుల్లో కార్బన్‌డై ఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కిట్లు లేకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
మునిగిపోయిన చైనా అణు జలాంతర్గామి ?
الجمعة، 27 سبتمبر 2024
international science technology మునిగిపోయిన చైనా అణు జలాంతర్గామి ? యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడి శాటిలైట్ దృశ్యాలను పరిశీలించే టామ్ షుగార్ట్ ఈ విషయాన్ని గుర్తించారు
ليست هناك تعليقات:
إرسال تعليق