హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తాము చనిపోతే పిల్లలు అన్యాయమైపోతారని భావించిన ఓ జంట తమ ఇద్దరు పిల్లల్ని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ (40), వర్షిణి (33) భార్యాభర్తలు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) సంతానం. గాజుల రామారంలోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్న వీరు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తొలుత పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు !
الأحد، 1 سبتمبر 2024
Criem telangana ఆర్థిక ఇబ్బందులు తాళలేక వాటి నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో హైదరాబాద్ లో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ليست هناك تعليقات:
إرسال تعليق