ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డ్‌ను స్మృతి మంధాన బద్దలు కొట్టింది. స్మృతి మంధాన ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో 4761 పరుగులు చేయగా.. సుజీ బేట్స్ 4758 పరుగులతో రెండో స్థానంలో ఉంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(4287), శ్రీలంక సారథి చమరి ఆటపట్టు(4282), న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్(3817) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా స్మృతి మంధాన రికార్డ్ సాధించింది. ఇదే నెలలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను స్మృతి మంధాన అధిగమించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధాన నిలిచింది. మూడు ఫార్మాట్లలో కలిపి మంధాన 10,868 పరుగులు చేసింది.
ఆసియా గేమ్స్ 2026 : అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్ నమోదు
الأحد، 20 سبتمبر 2026
Asian Games 2026 cricket semi-final match against Bangladesh Smriti Mandhana sets world record for most runs in international T20s sports
ليست هناك تعليقات:
إرسال تعليق