ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసిన దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని, యుద్ధ నేరంగా దీన్ని పరిగణించవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా దాడుల నేపథ్యంలో యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని యూఎన్ మానవహక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించారు. ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడటం యుద్ధం కిందకే వస్తుందన్నారు. ఈ దాడుల్లో సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళకు గురయ్యారని వెల్లడించారు. ఈ దాడులు తనను ఎంతో భయాందోళకు గురిచేశాయని వోల్కర్ వెల్లడించారు. ఈ దాడులు యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనికేషన్ సాధనాలను ఆయుధాలుగా మార్చడాన్ని ఆయన ఖండించారు.
హెజ్బొల్లాపై దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి !
السبت، 21 سبتمبر 2024
international మానవహక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని హెజ్బొల్లాపై దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి
ليست هناك تعليقات:
إرسال تعليق