హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ''రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారు. తొమ్మిది నెలల పాలనలోనే 2 నెలల పింఛన్లు మింగేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేయడంతో వ్యాధులు పెరిగాయి. ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారు. రాష్ట్రంలో 50శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదు''అని హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.
రేవంత్‌రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారు !
الأربعاء، 11 سبتمبر 2024
telangana భారాస నేత మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ రేవంత్‌రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారు హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రామా
ليست هناك تعليقات:
إرسال تعليق