హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం కాల్పులకు తెగబడ్డారు. రాయపూర్ రానీ ప్రాంతంలోని భరౌలి గ్రామంలో ఈ దాడి జరిగింది. ఈ సమయంలో బైక్‌పై ఉన్న చౌదరి మద్దతుదారుడికి రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్‌లోని ఆ వ్యక్తిని గోల్డీ ఖేరిగా గుర్తించారు. కల్కా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రదీప్ చౌదరి ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన కాన్వాయ్ వెళ్తుండగా కాల్పులు ఘటన చోటుచేసుకోవడంతో ఘటనా ప్రాంతంలో ఒక్కసారిగా తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. వెంటనే అంబులెన్స్ రప్పించి బుల్లెట్ గాయమైన గోల్డీ ఖేరిని ఆసుపత్రికి తరలించారు. అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కాల్పుల్లో గాయపడిన గోల్డీకి నేర కార్యక్రమాలతో సంబంధాలున్నాయని, గ్యాంగ్‌ల మధ్య గొడవలే ఈ కాల్పులకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి!
الجمعة، 20 سبتمبر 2024
haryana మద్దతుదారుడికి రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు శుక్రవారం సాయంత్రం కాల్పులకు తెగబడ్డారు హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి
ليست هناك تعليقات:
إرسال تعليق