ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య జనసేనలో చేరడం ఖాయమైంది. దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ చేతుల మీదుగా కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా రోశయ్య పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో 3.50 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవి చూశారు. అంతకుముందు 2019లో పొన్నూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారాయన. తాజాగా ఓటమి తరువాత వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. ఇక జనసేనలో కండువా కప్పుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. జిల్లాకే చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ఇటీవలే భేటీ అయ్యారని, చేరికకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెబుతున్నారు.
0 Comments