హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణానంతరం హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, తాత్కాలిక నాయకుడిగా నయీమ్ కస్సేమ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారి మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ భూతల దాడులను మొదలుపెట్టాలనుకుంటే అందుకు తాము కూడా రెడీగానే ఉన్నామని హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సేమ్ తెలిపారు. హెజ్‌బొల్లాలోని కీలక మిలటరీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది.. కానీ, ఆ దాడులు మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయిందన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాం. మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌పై పోరాటం చేస్తాం. మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైందని నయీమ్ కసేమ్ పేర్కొన్నారు. అయితే, కొన్ని రోజులుగా హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. బీరుట్‌పై జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించారు. ఆ తర్వాత మరో కీలక నేతను కూడా ఐడీఎఫ్ దళాలు చంపేశాయి. దాడులు ప్రారంభమైన 10 రోజుల వ్యవధిలోనే నస్రల్లాతో సహా ఆరుగురు కీలక కమాండర్లను హతమర్చింది ఇజ్రాయెల్. లెబనాన్‌లో 1000కి పైగా ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధం : నయీమ్ కస్సేమ్
الاثنين، 30 سبتمبر 2024
international ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధం ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ తాత్కాలిక నాయకుడిగా నయీమ్ కస్సేమ్ హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్
ليست هناك تعليقات:
إرسال تعليق