హైదరాబాద్ బ్రాండ్‌ను ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జినోమ్ వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30, 40 ఏళ్లుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, సకల వసతులు కల్పిస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సోమవారం లారస్ ల్యాబ్స్, కర్క ల్యాబ్స్ సుమారు 300 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో వందల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రారంభించాయన్నారు. ప్రపంచ ఫార్మా దృష్టిని ఆకర్షించేందుకు జినోమ్ వ్యాలీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా తయారు చేసి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే విషయమై చర్చించామన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ ఫార్మా దృష్టిని జినోమ్ వ్యాలీ ఆకర్షించేలా చేస్తాం !
الاثنين، 16 سبتمبر 2024
business telangana ప్రపంచ ఫార్మా దృష్టిని జినోమ్ వ్యాలీ ఆకర్షించేలా చేస్తాం ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం మంత్రి శ్రీధర్‌బాబు సకల వసతులు కల్పిస్తూ
ليست هناك تعليقات:
إرسال تعليق