వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలను పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమానికి వందలాది కార్యకర్తలు తరలివచ్చి, పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం కారణంగా ఈ నేతలు వైసీపీలో అసంతృప్తితో బయటకు వచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో వారు పవన్ సమక్షంలో అధికారికంగా జనసేనలో చేరడంతో, ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం మరింతగా పెరిగింది.
0 Comments