ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ తో సెల్పీ దిగేందుకు చాలా మంది పోటీ పడ్డారు. వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. జగన్ ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న సమయంలో అదే పనిగా ఆయన వద్దకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ అడిగి మరీ సెల్ఫీ తీసుకున్నారు. గుంటూరు జైలుకు వైఎస్ జగన్ వచ్చాక లోపల ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించారు. అనంతరం బయటికి వచ్చాక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సమయంలో ఆయేషా బాను అనే కానిస్టేబుల్ తన కుమార్తెతో జగన్ వద్దకు వచ్చి ఒక్క సెల్ఫీ తీసుకుంటానని అడిగారు. అంతటితో ఆగకుండా తమను ఆశీర్వదించమని కూడా కోరారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జగన్ తో ఎలా సెల్ఫీ తీసుకుంటారంటూ వారు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. జగన్ తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే కానిస్టేబుల్ ఆయేషా బానుకు ఛార్జిమెమో జారీ చేస్తామని జైలర్ రవిబాబు వెల్లడించారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ఓ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్ తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ పై చర్యలు ?
الجمعة، 13 سبتمبر 2024
Andhra Pradesh జగన్ తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ పై చర్యలు ? జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించేందుకు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జగన్ తో ఎలా సెల్ఫీ తీసుకుంటారంటూ వారు ఫిర్యాదులు
ليست هناك تعليقات:
إرسال تعليق