బఫర్ జోన్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశామని, కానీ ఆ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొన్ని కట్టడాలను కూల్చినప్పుడు హైడ్రా బాగా పని చేసిందని కితాబునిచ్చారని, ఇప్పుడు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారని వాపోయారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామన్నారు. హైడ్రా అధికారులు, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఓ ఆస్పత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ అదేచోట మళ్లీ నిర్మించారని తెలిపారు. అమీన్ పూర్ లోఆస్పత్రిని కూల్చేశారని చెబుతున్నారని, కానీ ఆ ఆస్పత్రిలో రోగులు ఎవరూ లేరని వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో రికార్డ్ చేశామన్నారు. ప్రజలు నివసిస్తున్న భవనాలను అస్సలూ కూల్చలేదన్నారు. ఇటీవల కూకట్ పల్లి నల్ల చెరువులో ఆక్రమణలను కూల్చివేశామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ఖాళీ చేయలేదని తెలిపారు. హైడ్రా విషయమై భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నదని, ఇది తెలిసి తాను చాలా బాధపడ్డానని రంగనాథ్ అన్నారు. బుచ్చమ్మను కొంతమంది భయపెట్టారన్నారు.
హైడ్రా భయంతో వృద్ధురాలు ఆత్మహత్య నన్ను చాలా బాధించింది !
السبت، 28 سبتمبر 2024
hyderabad telangana కమిషనర్ రంగనాథ్ సోషల్ మీడియాలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు హైడ్రా భయంతో వృద్ధురాలు ఆత్మహత్య నన్ను చాలా బాధించింది
ليست هناك تعليقات:
إرسال تعليق