జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ బుధవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం విలేకర్లతో ఇంజనీర్ రషీద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం పారాటం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజలను ఏకం చేసేందుకే తాను జైలు నుంచి తిరిగి వచ్చానని తెలిపారు. అంతేకానీ ప్రజలను విడగొట్టేందుకు కాదని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాశ్వత శాంతి తీసుకు రావాల్సి అవసరం ఉందన్నారు. కాశ్మీరీలు.. రాళ్లు రువ్వే వారు కాదనిన్నారు. రాజకీయ హక్కులు సాధించే క్రమంలో ఏ మాత్రం రాజీపడబోమని ఎంపీ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు.
ఎంపీ ఇంజనీర్ రషీద్ జైలు నుంచి విడుదల !
الأربعاء، 11 سبتمبر 2024
J&K national ఎంపీ ఇంజనీర్ రషీద్ జైలు నుంచి విడుదల జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం పారాటం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు
ليست هناك تعليقات:
إرسال تعليق