తిరుపతి లడ్డు కల్తీ పై నేను కూడా సీబీఐ విచారణ కు డిమాండ్ చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారు. కాబట్టి తిరుపతి లడ్డు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలి అన్నారు. నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలి అని కోరారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో ప్రతిపక్షాలు సహితం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు వాస్తవాలు బయటకు రావాలి. దేవుడి దగ్గర జరిగిన నిజాలు ప్రజలకు తెలియాలి. స్పీకర్ల కాన్ఫరెన్స్ లో నా పక్కన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి కూర్చున్నారు. మా మధ్యలో లడ్డు వివాదం పై చర్చ జరిగింది అని మోషేన్‌రాజు వివరించారు.
లడ్డు కల్తీ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా : శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు
الثلاثاء، 24 سبتمبر 2024
Andhra Pradesh కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలి లడ్డు కల్తీ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు
ليست هناك تعليقات:
إرسال تعليق