మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరారు. ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవికి గిన్నిస్ సర్టిఫికేట్ అందజేశారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గిన్నిస్ అవార్డును చిరంజీవికి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో కలిసి అమీర్ ఖాన్ హైదరాబాద్‌కి వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు గిన్నిస్ బుక్‌లో అధికారికంగా నమోదు అవుతుందని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 స్టెప్పులతో అలరించి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చిరంజీవికి ఈ అరుదైన అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు పాల్గొని చిరంజీవిని అభినందించారు. చిరంజీవి తన సినీ జీవితంలో ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనదైన నటన, డ్యాన్సులతో స్టార్ హీరోగా ఎదిగారు. 'పునాదిరాళ్లు' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన సినీ కెరీర్‌లో 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో పాటు, ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్‌తో ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నారు, ఇది 2024 సంక్రాంతికి విడుదల కానుంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరిన చిరంజీవి !
الأحد، 22 سبتمبر 2024
Andhra Pradesh cinema national telangana అమీర్ ఖాన్ గిన్నిస్ అవార్డును చిరంజీవికి అందజేశారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరిన చిరంజీవి
ليست هناك تعليقات:
إرسال تعليق