బాణసంచా కేంద్రం వద్ద పేలుడులో 8 మందికి గాయాలు


ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం, రావులచెరువులో బాణాసంచా కేంద్రం వద్ద ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.  పేలుడుతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments