సినీ నటుడు మహేష్ బాబు దంపతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి తెలంగాణలో వరద బాధితుల కోసం రూ.50 లక్షల చెక్కును అందజేశారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మల్టీప్లెక్స్ ఏఎంబీ నుండి అదనంగా మరో రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. మహేశ్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఉన్నారు. ఈ విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న మహేష్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడటంతో టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయాన్ని ప్రకటించారు.
వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు మహేష్ బాబు రూ.50 లక్షల చెక్కు అందజేత !
الاثنين، 23 سبتمبر 2024
telangana మల్టీప్లెక్స్ ఏఎంబీ నుండి అదనంగా మరో రూ. 10 లక్షలను విరాళం వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు మహేష్ బాబు రూ.50 లక్షల చెక్కు అందజేత
ليست هناك تعليقات:
إرسال تعليق