కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 2,63 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.8 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.
నాగార్జునసాగర్‌కు 24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
السبت، 7 سبتمبر 2024
Andhra Pradesh telangana నాగార్జునసాగర్‌కు 24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడి
ليست هناك تعليقات:
إرسال تعليق