ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద మణిపూర్‌కి చెందిన కుకీ స్టూండెట్స్ ఆర్గనైజేషన్ (కెఎస్‌ఒ) ఆధ్వర్యంలో విద్యార్థులు, మద్దతుదారులు భారీ నిరసన చేపట్టారు. మణిపూర్‌లోని బఫర్‌జోన్ నుండి అస్సాం రైఫిల్స్‌కు చెందిన 9వ, 22వ బెటాలియన్‌లను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్ స్థానంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)తో ఎదురయ్యే పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 2023 మేలో కేంద్ర హోం శాఖ సమస్యాత్మక ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ బలగాలను నియమించిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులను అదుపుచేయడంలో అస్సాం రైఫిల్స్ కీలక పాత్ర పోషించాయని కెఎస్‌ఒ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ అస్థిర సమయంలో వారి తొలగింపు శాంతి దిశగా సాధించిన పురోగతిని కూలదోసే ప్రమాదం ఉందని, మరియు హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరించింది. మణిపూర్‌లోని సామాజిక, రాజకీయ ంస్థలతో పాటు స్థానిక సంఘాల నుండి అస్సాం రైఫిల్స్ సంపాదించిన నమ్మకాన్ని హైలెట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ ఉపసంహరణను వ్యతిరేకిస్తూ కుకీల నిరసన !
الأحد، 11 أغسطس 2024
Manipur national అస్సాం రైఫిల్స్ ఉపసంహరణను వ్యతిరేకిస్తూ కుకీల నిరసన ఎదురయ్యే పరిణామాల గురించి ఆందోళన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్
ليست هناك تعليقات:
إرسال تعليق