యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా !


యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు. ఇది పీపీపీ మోడల్‌లో ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని తాను ఆనంద్ మహేంద్రకు విజ్ఞప్తి చేశానన్నారు. ఆయన రెండు రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల సమీకరణ కోసమే ఈ రోజు న్యూయార్క్ పర్యటనకు వచ్చానన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు వచ్చాయన్నారు. అధికారంలో టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మరో పార్టీ ఉన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించి ముందుకు సాగుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఈరోజు 250 కిలో మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. 

Post a Comment

0 Comments