ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుమూసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. గత రెండేళ్లుగా గ్రాహం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. తన అంతర్జాతీయ కెరీర్ ను 1993లో ప్రారంభించారు. టెస్టుల్లో 100 మ్యాచులాడి 6744 రన్స్, వన్డేల్లో 82 మ్యాచులాడి 2380 రన్స్ చేశారు. 2002లో వన్డేలు, 2005లో టెస్టుల నుంచి రిటైరయ్యారు.
0 Comments