భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరలైంది. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించడంతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లీ తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. బాగానే ఉన్నానంటూ థమ్స్‌అప్ సింబల్ చూపించాడు. ''దేవుడి దయవల్ల బాగున్నాను. మైదానానికి వెళ్లి బ్యాటింగ్ చేసేంతా ఫిట్‌గా ఉన్నాను'' అని తాజాగా ఎక్స్‌లో కాంబ్లీ పోస్టు పెట్టాడు. సచిన్‌కు చిన్ననాటి స్నేహితుడైన కాంబ్లీ.. ఆరంభంలో మెరుపులు మెరిపించాడు. వందకుపైగా వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పదివేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి..వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. మరోవైపు సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నత రికార్డులను సృష్టించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న సంగతి తెలిసిందే.
0 Comments