మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. మూడు రోజులపర్యటనలో భాగంగా ఆగస్టు 11వరకు అక్కడే ఉండనున్న ఆయన ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. చివరిసారిగా 2023 జనవరిలో జైశంకర్ అక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. భేటీకి సంబంధించి 'ఎక్స్'లో స్పందించిన జైశంకర్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ కావడం విశేషమన్న ఆయన, భారత ప్రధాని మోడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ తమ మిత్రదేశాల్లో భారత్ ఎల్లప్పుడూ ఉంటుందని, మాల్దీవులకు అవసరమైనప్పుడల్లా సహాయాన్ని అందిస్తుందని అన్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో జైశంకర్ భేటీ !
Saturday, August 10, 2024
india Maldives national తమ మిత్రదేశాల్లో భారత్ ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని మోడీ తరఫున శుభాకాంక్షలు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో జైశంకర్ భేటీ
No comments:
Post a Comment