ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ కేటాయింపుల్లో భాగం ప్రైవేట్ ఉద్యోగుల కనిష్ట పీఫ్ వేతన పరిమితిని పెంచాలని కోరుతూ కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రపోజల్ పంపింది. ఫైనాన్స్ మినిస్ట్రీ త్వరలోనే కార్మిక మంత్రిత్వశాఖ పంపిన ప్రపోజల్ పై నిర్ణయం తీసుకోనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రపోజల్ లో ప్రైవేట్ ఉద్యోగులకు ప్రస్తుతమున్న కనిష్ట రూ.15000 వేతన పరిమితిని రూ.21000 కు పెంచాలని సూచన చేసింది. ఈ ప్రపోజల్ ని ఆర్థిక శాఖ త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. 2014, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఒ) ఆధ్వర్యంలోని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపిఎస్) వేతన పరిమితి రూ.15000 గా ఉంది. అయితే ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగులకు అందే పెన్షన్, ఇతర లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు పెన్షన్, ఈపిఎఫ్ కాంట్రిబూషన్ విషయంలో కార్మిక శాఖ సూచనలకు ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే.. వేతన పరిమితి రూ.15000 నుంచి రూ.21000 పెరుగుతుంది. ఫలితంగా ఈపిఎస్ వేతన పరిమితి రూ.21000 పెరిగితే.. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మొత్తం కూడా అధికంగా లభిస్తుంది. మరోవైపు ఈపిఎస్-95 జాతీయ నిరసన కమిటీ సభ్యులు మంగళవారం ఈపిఎఫ్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతినెలా అందే పెన్షన్ ని కనీసం రూ.7500 చేయాలని చాలా కాలంగా ఈ కమిటీ డిమాండ్ చేస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో పెన్షనర్లకు పూర్తి మెడికల్ కవరేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెన్షనర్లకు ప్రతి నెలా సగటున రూ.1450 మాత్రమే పెన్షన్ లభిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.7500 పెంచాలని ఈపిఎస్-95 ఎన్ఎసీ చాలా కాలంగా నిరసనలు చేస్తోంది. ఆగస్టు నెల మొదటివారంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా తో ఈపిఎస్-95 జాతీయ నిరసన కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవియా వారి డిమాండ్లు నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం ?
الأربعاء، 28 أغسطس 2024
national ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం ? కార్మిక మంత్రిత్వ శాఖ రూ.15000 వేతన పరిమితిని రూ.21000 కు పెంచాలని సూచన
ليست هناك تعليقات:
إرسال تعليق