Ad Code

జీ - సోనీ వివాదానికి ముగింపు?


ప్రముఖ మీడియా సంస్థలైన జీ- సోనీ మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో నెలకొన్న వివాదాలను ఇరు సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. డీల్‌ రద్దు అనంతరం పరస్పరం పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకునేందుకు ఓ నిర్ణయానికొచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌, ఇతర ఫోరమ్స్‌లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాయి. ఎవరికి వారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చాయి. వివాదం ముగిసిన వేళ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఓ దశలో 14 శాతం మేర రాణించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తో కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (గతంలో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ -ఎస్‌పీఎన్‌ఐ) 10 బిలియన్‌ డాలర్ల విలీనం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల అనంతరం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు చెందిన సోనీ గ్రూపు కార్పొరేషన్‌ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీంతో ఇరు సంస్థల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

Post a Comment

0 Comments

Close Menu