Ad Code

ఇండియాలో యాపిల్‌ నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ?


ఇండియాలో యాపిల్‌ సంస్థ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు. దేశంలో శ్రామిక శక్తి పెంచేందుకు యాపిల్‌ చేపడుతున్న కార్యకలాపాలపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందించింది. వ్యాపార విస్తరణలో భాగంలో దేశంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని అందులో వివరించింది. యాపిల్‌ సంస్థ చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. దీంతో దేశీయంగా తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీంతో ఏడాది మార్చి నాటికి ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ఉపాధి పొందనున్నారు. వీరిలో 70శాతం మంది మహిళలే ఉండొచ్చు. యాపిల్‌ కాంట్రాక్ట్‌ తయారీ దారులైన ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, పెగట్రాన్‌ ద్వారా ఇప్పటికే 80,872 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. యాపిల్‌ సరఫరా సంస్థలైన టాటా గ్రూప్‌, సాల్కాంప్‌, మథర్‌సన్‌, ఫాక్స్‌లింక్‌, ఏటీఎల్‌ నుంచి 84,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు పొందారు. బ్లూ కాలర్‌ ఉద్యోగాల సృష్టిలో అతి పెద్ద సంస్థగా యాపిల్‌ అవతరించింది. 2020లో తీసుకొచ్చిన పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఇప్పటివరకు ఏకంగా 1,65,000 మందిని నియమించుకుంది. మరోవైపు తమిళనాడులో ఏర్పాటు చేసిన ఐఫోన్‌ యూనిట్‌లో ఉత్పత్తుల సామర్థ్యం పెంచనుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమంలో ప్రతి ప్రత్యక్ష స్థానానికి మూడు అదనపు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 

Post a Comment

0 Comments

Close Menu