ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రగస్టు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు జెండా ఎగురవేయనున్నారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొననున్నారు. మిగతా జిల్లాలో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. అల్లూరి జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా దళాల నుంచి గౌరవ వందనం కూడా స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
الجمعة، 9 أغسطس 2024
Andhra Pradesh కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రస్థాయిలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రగస్టు వేడుకలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق