ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దికొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఆల్కహాలిక్ పానీయాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అయితే అందరి శరీరంలో ఒకే విధమైన స్పందన ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆల్కహాల్ ప్రతి వ్యక్తి శరీరంలో వివిధ ప్రతిచర్యలను కలిగిస్తుంది. అతిగా తాగడం వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లలో ఈ రిస్క్ చాలా ఎక్కువ. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గడం వివిధ శారీరక సమస్యలను కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరగవచ్చు. అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది.
ホーム
/
లివర్ డ్యామేజ్
/
ఆల్కహాల్ - డయాబెటిస్ !
السبت، 31 أغسطس 2024
arogyam Health Tips అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఆల్కహాల్ - డయాబెటిస్ కార్బోహైడ్రేట్లు ఎక్కువ కిడ్నీలు చక్కెర లివర్ డ్యామేజ్
ليست هناك تعليقات:
إرسال تعليق